బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

గణేశ్ నిమజ్జనం బందోబస్తుపై వెస్ట్ జోన్‌లోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం.

వెస్ట్ జోన్ పరిధిలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో సి.వి. ఆనంద్ ఐపిఎస్, డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం బందోబస్తుపై వెస్ట్ జోన్‌లోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు ఇతర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. అసాంఘిక శక్తులపై, పిక్ పాకెటర్లపై, ఈవ్ టీజర్లపై, గొలుసు దొంగతనం వంటి నేరాలను నివారించడానికి స్థానిక పోలీసులు, షీ టీమ్, వాలంటీర్లు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ముందు జాగ్రత్తగా రాత్రిపూట విగ్రహాల వద్ద నిర్వాహకులు లేదా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సాధారణంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం సమయంలో జరిగే లోటుపాట్ల గురించి, శాంతిభద్రతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గణేశ్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించి, మండప నిర్వాహకులకు విగ్రహాలను నిమజ్జనానికి సాధ్యమైనంత త్వరగా బయలుదేరి, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించాలని అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఎస్.ఎమ్.విజయ కుమార్ ఐపీఎస్ (డీసీపీ, వెస్ట్ జోన్), శ్రీమతి కె. అపూర్వ రావు ఐపీఎస్ (డీసీపీ, ఎస్.బి), బి.కె. రాహుల్ హెడ్గే ఐపీఎస్ (డీసీపీ, ట్రాఫిక్),ఇక్బాల్ సిద్ధీఖీ, అడిషినల్ డీసీపీ టాస్క్ ఫోర్స్, మరియు వెస్ట్ జోన్‌లోని అడిషినల్ డిసిపి,ఎసిపి మరియు అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి