హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయము ,ఐసిసిసి భవనము, బంజారాహిల్స్, రోడ్ నెం.12, హైదరాబాదు నందు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పరిమళ హానా నూతన్ ఐపిఎస్ జాయింట్ సిపి (అడ్మిషన్) హైదరాబాదు జాతీయ జెండాను ఆవిష్కరించినారు తరువాత అందరు కలసి జాతీయ గీతాలాపన చేసినారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పరిమళ హానా నూతన్ ఐపిఎస్ జాయింట్ సిపి (అడ్మిన్) మాట్లాడుతూ “జనవరి 26, 1950 నాడు భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిందని, కావున ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటామని తెలిపారు. పోలీసు వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజాసేవ చేస్తారని ,మన మందరము కలసికట్టుగా పని చేస్తేనే ప్రజలకు మంచి సేవలందిస్తామని తెలిపారు, పోలీసు కమిషనర్ కార్యాలయ సిబ్బంది అందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపినారు.
K. పుష్పా రెడ్డి IPS DCP ICCC, K. రవీందర్ రెడ్డి Addl DCP ICCC, M.నర్సింగ్ రావు DSP ICCC, R.గంగారం DSP ICCC, సతీశ్ పిఎస్ టు సిపి హైదరాబాదు, కె.వెంకటేశ్వర్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్, శ్రీదేవి ADO, విజయభాస్కర్ రెడ్డి, ఏసీపీ, ఐసీసీసీ, ఎం.సత్యనారాయణ డీఎస్పీ కమ్యూనికేషన్స్, ఉమాకాంత్ జేఏఓ మరియు ట్రాఫిక్ ఈ-చలాన్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు మరియు సిబ్బంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, కమ్యూనికేషన్ మరియు మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.