Breaking News

నారాయణఖేడ్ పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను సందర్శించిన – జిల్లా ఎస్పీ.

ఎడతెరిపి లేకుండా కుండపోతాల కురుస్తున్న వర్షాల దృష్ట్యా నారాయణఖేడ్ మండల పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా వరద ప్రవాహం వలన ఏవైన గ్రామాలకు ప్రమాదం ఉండాని, అధికారులకు అడిగి తెలుసుకున్నారు. పొంగిపోర్లే వాగులను చూడటానికి ఎవ్వరూ రాకుండా ప్రమాద సూచిక బోర్డు లను ఏర్పాటు చేయించాలని, ప్రమాదంగా ఉన్న బ్రిడ్జ్ ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని అన్నారు. నీళ్ళలో ఉన్న కరెంట్ పోల్స్ దగ్గర నుండి వెళ్లారాదని అన్నారు. పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు. పొంగిపోర్లే వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయాలలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. వర్షాల దృష్ట్యా వినాయక మండపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని, వర్షానికి క్రుంగిపోని విధంగా, మండప నిర్మాణాలు ఉండాలని, షాక్ సర్క్యూట్ కాకుండా ఎలెక్ట్రిక్ వైర్ కనెక్షన్ ఉండేలా చూడాలని, మద్యపాల వద్దకు వచ్చి, పోయే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం ఉండాలని ఎస్పీ సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సిబ్బంది 24*7 హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రమాదఅంచున ఉన్న జలాశయాలను ఎవ్వరూ చూడటానికి, దాటడానికి ప్రయత్నించకుండా సరైన భద్రత ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.
ఈ విజిటింగ్ లో ఎస్పీ వెంబడి నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట రెడ్డి, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ విధ్యాచరన్ రెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *