
• వినాయక ప్రతిమను ప్రతిష్టించాలనుకుంటున్నారా అయితే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
• శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి.
• ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుంది. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.,వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆయా మండల కేంద్రాలలో వివిధ మతాలకు చెందిన పెద్దలతో కమ్యూనిటీ లీడర్స్ తో పీస్ కమిటీలు నిర్వహించడం జరిగిందని, ఒకరి మాట సాంప్రదాయాలను మరొకరు గౌరవించి, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, తెలియజేశారు. పర్యావరణానికి హాని కలిగించని, మట్టి వినాయకులను ప్రతిష్టించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. వినాయక ప్రతిమను ప్రతిష్టించదలచినవారు సంగారెడ్డి జిల్లా పోలీసులకు ఆన్లైన్ https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా సమాచారం అందించాలన్నారు. యస్.హెచ్.ఒ.లు ప్రతి మండపాన్ని ప్రత్యక్షంగా సందర్శించాలని, అక్కడ మండపాల వద్ద భద్రతపరమైన ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. వినాయక ప్రతిష్టాపనకై ఏర్పాటు చేసే మండప నిర్మాణం రోడ్లపై చేపట్టకుండా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా మండప యజమానులకు సూచించాలని అన్నారు. భద్రత దృష్ట్యా ప్రతి మండపం వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని, ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద శబ్దాలతో కూడిన లౌడ్ స్పీకర్స్, డి.జె. లకు అనుమతి లేదని, ఎవరైన డి.జె. ఏర్పాటు చేస్తే మండప నిర్వాహకులపై, డి.జె యాజమానులపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు సూచించాలన్నారు. మండప ఏర్పాట్లకు సంభందించి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా పోలీసు అనుమతి తీసుకునేలా చూడాలని, మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించేలా చూడాలని అన్నారు. నిమార్జనం రోజు చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండే విధంగా సంభందిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పాతనేరస్తులను, ముందస్తుగా బైండోవర్ చేయాలని, సమస్యలను సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరాదు అన్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా ద్వారా వచ్చే పుకార్లను నమ్మరాదని, ఫార్వార్డ్ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా, శాంతియుత వాతావరణంలో పండగను జరుపుకోవాలని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు. మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి.టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వినాయక మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు. వినాయక మంటపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వినాయక మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలి. రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి వచ్చే పోలీస్ అధికారికి మంటప వలంటీర్లు సహకరించాలి. మట్టి వినాయక విగ్రహాలను పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మితిమీరిన విగ్రహ పరిమాణల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున విగ్రహ పరిమాణాలలో పరిమితులు పాంటించాలి. అత్యవసర సమయంలో, ఏదైనా సమాచారం ఉన్నా డయల్ 100 కు గాని, సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలి.
