బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుగచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు
Uncategorized

వివిధ రౌడీషీటర్లు మరియు క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య గొడవలు – సి.వి. ఆనంద్ ఐపీఎస్.

సి.వి. ఆనంద్, ఐపీఎస్ డిజి, కమిషనర్ ఆఫ్ ఫోలీసు మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని టిజిఐసీసిసీలో ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎగ్జిక్యూటివ్ కోర్టును నిర్వహించారు. ఈ కోర్టులో, హైదరాబాద్ నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, మరియు సౌత్ వెస్ట్ జోన్‌లలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి వివిధ రౌడీషీటర్లు మరియు క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న గొడవలను పరిష్కరించారు. పోలీస్ స్టేషన్‌ల నుండి వచ్చిన నివేదికలను సి.వి. ఆనంద్, ఐపీఎస్ డిజి , కమిషనర్ ఆఫ్ ఫోలీసు మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పరిశీలించారు. ఈ నివేదికల ప్రకారం, ఈ గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, హత్యలు, మరియు హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడ్డారని వెల్లడైంది. కోర్టు విచారణలో 10 పోలీసు స్టేషన్లకు సంబంధించిన 11 గ్యాంగ్‌ల సంబంధించిన 101 సభ్యులను విడిగా విచారించారు. అందులో 6 గ్యాంగ్‌లు తమ పెద్దలు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో శాంతియుతంగా రాజీ చేసుకున్నామని తెలిపారు. మిగిలిన గ్యాంగ్‌లు తమ విచారణ తర్వాత ఎటువంటి నేరాలకు పాల్పడలేదని, భవిష్యత్తులో కూడా శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చారు. సి.వి. ఆనంద్, ఐపీఎస్ డిజి , కమిషనర్ ఆఫ్ ఫోలీసు మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారికి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లయితే, వారికి BNSS, 2023లోని సెక్షన్ 126 ప్రకారం కొంత కాలం పాటు శాంతిని కొనసాగించేలా బాండ్ రాయించుకుంటామని ఆయన తెలిపారు. ఈ కోర్టు విచారణను తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఈ కోర్టుకు శ్రీమతి కె.ఆపూర్వా రావు ఐపిఎస్ డిసిపి స్పెషల్ బ్రాంచ్,హైదరాబాదు మరియు పైన తెలిపిన 10 పోలీసు స్టేషన్ల అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు. 

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్