బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుగచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు
Uncategorized

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

హైదరాబాద్, ఆగస్టు 16, 2026: ఫిట్‌నెస్‌, ఆరోగ్యకరమైన జీవనశైలి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచాలనే సందేశంతో Network18 ఆధ్వర్యంలో, News18 తెలుగు సంయుక్తంగా నిర్వహించిన ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ ఆదివారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, News18 డిప్యూటీ ఎడిటర్ పీవీ రమణ కుమార్, కార్యక్రమ నిర్వాహకులు కలిసి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఉదయం 5.30 గంటల నుంచే గచ్చిబౌలి స్టేడియం రన్నర్లతో సందడిగా మారింది. పిల్లలు, యువత, కుటుంబాలు, సీనియర్‌ సిటిజన్లు సహా సుమారు 5 వేల మంది వివిధ రన్‌ కేటగిరీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫిట్‌నెస్‌ను ప్రజల జీవనశైలిలో భాగం చేయడం, అన్ని వయసుల వారిని శారీరక దారుఢ్యం వైపు ప్రోత్సహించడం, ఆరోగ్య చైతన్యాన్ని పెంచడం, కమ్యూనిటీ స్పిరిట్‌ను బలోపేతం చేయడం ‘మన రన్’ ప్రధాన లక్ష్యాలని నిర్వాహకులు తెలిపారు. గత ఎడిషన్‌లో 4 వేల మందికి పైగా పాల్గొనగా, ఈసారి మరింత విస్తృత స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీపీ సజ్జనార్

ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ యువత ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు.

యువత వ్యసనాల బారిన పడి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని సీపీ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, అలాంటి ఘటనలను నివారించేందుకు డ్రంకన్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న Network18, News18 Teluguను అభినందించారు.

ప్రతిరోజూ ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించాలి: డీసీపీ అన్నపూర్ణ

డీసీపీ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ వాకింగ్‌, రన్నింగ్‌ లేదా వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించాలని, యువత డ్రగ్స్‌కు ‘నో’ చెప్పి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

1K నుంచి 10K వరకు రన్‌ కేటగిరీలు

‘మన రన్–2026’లో పిల్లల కోసం 1K, 2K కిడ్స్‌ ఫన్‌ రన్స్‌, 2K కాస్ట్యూమ్‌ రన్‌, 3K వాక్‌థాన్‌, 5K, 10K ఫన్‌ రన్స్‌ నిర్వహించారు. వీటితో పాటు 5K, 10K టైమ్డ్‌ రన్స్‌ కూడా జరిగాయి.

టైమ్డ్‌ రన్‌లలో ఓపెన్‌, వెటరన్‌ విభాగాల్లో పురుషులు, మహిళలు పోటీపడ్డారు. మొత్తం రూ.3 లక్షల ప్రైజ్‌ పూల్‌ ప్రకటించారు. టైమ్డ్‌ రన్‌లకు చిప్‌ టైమింగ్‌ సదుపాయం కల్పించగా, పాల్గొన్న రన్నర్లకు టీ-షర్ట్‌, బిబ్‌, ఫినిషర్‌ మెడల్‌ అందించారు.

విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు

10K, 5K టైమ్డ్‌ రన్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌తో పాటు నగదు పురస్కారాలను అందజేశారు.

10K ఓపెన్‌ పురుషులు: షరద్‌ అహిరే (30:30) ప్రథమ, రోహిత్‌ బిన్నర్‌ (30:35) ద్వితీయ, చైతన్య రూప్‌నర్‌ (30:41) తృతీయ స్థానాల్లో నిలిచారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

10K ఓపెన్‌ మహిళలు: యామిని ఠాకరే (37:30) మొదటి, సాక్షి పోలోజ్వర్‌ (38:10) రెండో, గడ్డం రాజేశ్వరి (41:55) మూడో స్థానాలు సాధించారు.

10K వెటరన్‌ పురుషులు: ప్రమోద్‌ ఉర్కుడే (35:25), ఏ.ఎం.ఆర్.పీ. (35:37), భాస్కర్‌ కాంబ్లే (36:22) వరుసగా తొలి మూడు స్థానాలు సాధించారు.

10K వెటరన్‌ మహిళలు: సుపర్ణా దాస్‌ (50:16), క్షీరసాగర రామాస్మిత (53:04), వందనా సింగ్‌ (54:45) విజేతలుగా నిలిచారు.

5K ఓపెన్‌ పురుషులు: దాదా షింగడే (15:27), అనికేత్‌ దేశ్‌ముఖ్‌ (15:29), లవ్‌ చౌధరీ (15:33) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

5K ఓపెన్‌ మహిళలు: షివానీ సాహు (18:49), కోడవత్‌ స్వప్న (19:08), అంజలి పండిత్‌ (20:16) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు.

5K వెటరన్‌ పురుషులు: సంతు జీవా వార్డే (18:07), ఏ.ఆర్.పీ. (18:38), రంజిత్‌ కన్బార్కర్‌ (19:47) తొలి మూడు స్థానాలు సాధించారు.

5K వెటరన్‌ మహిళలు: జ్యోతి ప్రోవా దత్తా ఖానికర్‌ (27:31), సవితా శాస్త్రి (29:51), ఉషా దీప్‌చంద్‌ పాటిల్‌ (39:58) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

‘మన రన్–2026’ రెండో ఎడిషన్‌ విజయవంతంగా ముగియడంతో హైదరాబాద్‌లో ఫిట్‌నెస్‌ సంస్కృతికి మరింత ఊతం లభించింది. “ఆరోగ్యం కోసం పరుగెత్తండి.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లింది.