
గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని,పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి యోగ,మేరిటేషన్ లాంటివి అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై ,గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు విద్యార్థులకు వాలీబాల్స్ అందజేషి,తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులతో కలసి SAY NO TO DRUGS కి సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరించిన ఎస్పీ. విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని,మాధకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని అందులో భాగంగా జిల్లాలో విద్యార్థులు,ఉపాధ్యాయుల భాగస్వామ్యం తో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నన్నారు. ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సైనికుడిగా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి కి సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 లేదా జిల్లా టాస్క్ఫోర్స్ సి.ఐ 87126 56392 నంబర్లుకు పోన్ ద్వారా తెలియజేయాలని కోరారు. విద్యార్థిని,విద్యార్థులు జీవితంలో ఉన్నత విజయాలను చేరుకోవడానికి హార్డ్ వర్క్ యే ప్రధాన అస్త్రం అని,కష్టపడే తత్వమే విజయాల దరికి చేరుస్తుందన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తము ఎంచుకున్న లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలను మధ్యలో నిలిపివేయకుండ ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో,ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక సారి చేసిన తప్పును మళ్లీ చేయకుండ ఆ తప్పులు నుండి నేర్చుకొని విజయాలు సాధించాలని,విద్యార్థులు ఎప్పుడు తమకు తామే పోటీ అనుకోవాలే తప్ప ఇతరులతో తమను తాము దేనిలోనూ పోల్చుకోవద్దని సూచించారు. పరీక్షలలో మార్కులు తక్కువ, మధ్యస్థంగా వచ్చిన ఎవరు బాధపడనవసరం లేదని, గొప్ప గొప్ప స్థాయికి వచ్చినా వారంతా అవ్యరేజ్ స్టూడెంట్స్ అన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి ఒత్తిడిని అధిగమించడానికి యోగ, మెడిటేషన్, బుక్స్ చదవడం లాంటివి అలవర్చుకోవలన్నారు. విద్యార్ధిని విద్యార్ధుల సోషల్ మీడియా(ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్)కు దూరంగా ఉండాలని,ప్రస్తుతం మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు,సోషల్ మీడియా వేధింపులు ఆన్లైన్ వేధింపులు సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ నంబర్ 87126 56425 సమాచారం ఇవ్వగలరని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచభడతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి , నార్కోటక్ బ్యూరో డిఎస్పీ ఉపేందర్, సి.ఐ కృష్ణ, సిబ్బంది, పాటశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.
