పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం అయినా గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 300 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, గ్రామస్థులకు మందుల పంపిణీ
ముఖ్య అతిధిగా హాజరు అయినా పంచాయితీ రాజ్, గ్రామీణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క.
సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ….
‘వైధ్యో నారాయణ హరి’ వైద్యుడు మనకి కనిపించే నిజమైన దేవుడని పంచాయతీ రాజ్ , గ్రామీణ స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం ఏజెన్సీ మండలంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. మారుమూల ప్రాంతాల్లో పోలీసులు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని, వాతావరణ మార్పుల వల్ల ప్రజలకు కొత్త రోగాలు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు మనకు పునర్జన్మనిస్తారని, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు భరోసాగా ఉంటామన్నారు,పోలీసులు అంటే ప్రజలకు సేవ చేయాలని, శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు.వరదల సమయంలో పోలీసుల సేవలు ఎంతో అభినందనీయం అని అన్నారు. ప్రజలకు తమేపుడు రుణపడి ఉంటామన్నారు.
జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయినా గూడూరు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో గంగారం గ్రామంలో బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరానికి చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు సుమారు 1500 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా వృద్ధులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లు, గ్రామస్థులకు మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….
చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని చదువు ద్వారా మాత్రమే ఒక సాధారణ వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుతారని తెలిపారు. ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రజా శ్రేయస్సును ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్న వారిని అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరడమైనది. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని అన్నారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
మెగా వైద్య శిబిరం లో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు భోజన సౌకర్యం కల్పించడం జరిగింది.
వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్ల బృందానికి మంత్రి సీతక్క చేతుల మీదుగా శాలువా కప్పి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, గూడూరు సీఐ బాబురావు, రూరల్ సీఐ సరవయ్య, బయ్యారం సీఐ రవి, డోర్నకల్ సీఐ రాజేష్, ఎస్.బి సీఐ చంద్రమౌళి, ఎస్.ఐలు,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబాబాద్, నర్సంపేట డాక్టర్స్ బృందం, స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.