బ్రేకింగ్ న్యూస్
రుద్రారం పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహనకుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులుపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్రుద్రారం పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహనకుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులుపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్
Uncategorized

బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి-అడిషనల్ ఎస్పి.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు.
బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి. అడిషనల్ ఎస్పి జి.రమేష్.
నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురౌవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, అదేవిధంగా జులైలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము అని అడిషనల్ ఎస్పీ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనలతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్-XI సమావేశ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జూలై 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ పరిధిలో మూడు టీమ్ లుగా ఏర్పాటు చేసి ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన/ వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపనిలలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే సంభందిత యాజమాన్యాలపై కేసులు నమోదు తప్పవు అని హెచ్చరించారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు ఉన్న, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్న 1098 గాని, డయల్ 100కి గాని వారికి సమాచారం ఇవ్వాలి అని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని కోరినారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ,అస్సిస్టెంట్ లేబర్ ఆపిసర్ కృష్ణవేణి, ఏ.హెచ్.టి.యు ఎస్.ఐ రంగా రెడ్డి,ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి