Breaking News

గత కొద్ది రోజుల నల్లగొండ పట్టణము నంధు గంజాయి అమ్ముచున్న వ్యక్తి అరెస్టు.

సుమారు (02) కిలోల గంజాయి స్వాధీనము.
గత కొంత కాలం నుండి బీహార్ నుండి నల్లగొండ కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ధ నుండి సుమారు (02) కిలోల గంజాయిని స్వాధీనము చేసుకోనైనధి.
A-1. రాకేశ్ కుమార్ S/o రామ్ పర్వేజ్ కుమార్ సింగ్,
A-2. పప్పూ యాదవ్ r/o ధమారియా రైల్వే స్టేషన్ ధగ్గర,
A-1) రాకేశ్ కుమార్ ఇంటర్మీడియట్ వరకు అతని సొంత గ్రామములోనే చదువుకుని తర్వాత చదవడము ఇష్టము లేక చదువు ఆపివేసి ఆ తర్వాత బ్రతుకు దెరువు కోసము సూర్యాపేటకు వచ్చి అక్కడ ఒక రైస్ మిల్లు నంధు రెండు సంవత్సరములు హమాలిగా పని చేసినాడు. నేరస్తునికి గంజాయి త్రాగడము అలవాటు వుండటము వలన బీహార్ నుండి వచ్చేటప్పుడు త్రాగడానికి గంజాయి తెచ్చుకునేవాడు. నేరస్థుడు సుమారు ఒక సంవత్సరము నుండి నల్లగొండ లోని శ్రీనగర్ కాలనీ లో ఉన్న వేంకటేశ్వర రైస్ మిల్లు లో హమాలిగా పని చేస్తూ అతడు గంజాయి అలవాటు పడటము వలన ఏ పని చేత కాకపోవడము వలన గంజాయిని తెచ్చి నల్లగొండలో అమ్మితే డబ్బులు వస్తాయని భావించి సుమారు ఆరు నెలల నుండి భీహార్ రాష్ట్రము లోని ఖగారియా జిల్లాలోని ధమారా రైల్వే స్టేషన్ ధగ్గరలో వుండే A-2. పప్పూ యాదవ్ ధగ్గర గంజాయి ని ఒక కిలో రూపాయలు 12500/- లకు కొనుగోలు చేసి నల్లగొండ కు తీసుకుని వచ్చి గంజాయిని చిన్న పాకెట్లు గా తయారీ చేసి నల్ల గొండ లో గుర్తు తెలియని గంజాయి తాగే వ్యక్తులకు ఒక్క పాకెట్ 300/- రూపాయల చొప్పున అమ్ముచున్నాడు. నేరస్థుడు కొద్దిరోజుల క్రితము అతని సొంత గ్రామానికి వెళ్ళి A-2. పప్పూ యాదవ్ వద్ధ (02) కిలోల గంజాయి ని కొనుగోలు చేసి రైలులో సికింద్రాబాద్ కు వచ్చి అక్కడి నుండి రైలులో నల్లగొండ వచ్చి రైలు దిగి వెల్లుచుండగా తేధి 18-04-2025 రోజున సాయంత్రము 4.30 గంటలకు పోలీసువారికి వచ్చిన నమ్మధగిన సమాచారము మేరకు నేరస్థున్ని నల్లగొండ రైల్వే స్టేషన్ లో యున్న పార్కింగ్ స్థలము వద్ధ పట్టు బడి చేసినారు. నేరస్థుడు A-1. రాకేశ్ కుమార్ ను కోర్టుకు రిమాండ్ చేయనైనధి. A-2. పప్పూ యాదవ్ పరారీలో యున్నాడు. ఇట్టి కేసును నల్గొండ DSP, K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో Nalgonda II town సర్కిల్ ఇన్స్పెక్టర్ S.రాఘవ రావు ఆద్వర్యంలో ఇట్టి నేరస్థున్ని పట్టుబడి చేసి (2) కిలోల గంజాయి రికవరీ చేసిన నల్గొండ II టౌన్ యస్. ఐ వై.సైదులు మరియు వారి సిబ్బంది శంకర్, బాలకోటి లను జిల్లా S.P అభినందించనైనది. అధే విధంగా గత కొద్దిరోజుల నుండి జిల్లా SP పర్యవేక్షణలో అమలు చేస్తున్న మిషన్ పరివర్తనలో బాగంగా నేరస్థుడు A-1. రాకేశ్ కుమార్ నుండి నల్లగొండ పట్టణములో గంజాయి త్రాగుచున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడము జరుగుచున్నధి.

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *