
నల్లగొండ జిల్లా దేవరకొండ సబ్ డివిజన్ చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ వైద్య బృందం మరియు జె.జె.యం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తో కలిసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించినారు. ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపులో జరనరల్ ఫిజిషియన్,జనరల్ సర్జరీ,గైనకాలజిస్ట్,ఆప్తాల్మాలజిస్ట్,ఆర్థోపెడిక్, డెంటల్,డయాబెటిస్, ఈసీజీ స్కానింగ్,లాంటి ప్రత్యేక 15 మంది డాక్టర్ల బృందం చేత పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది వివిధ రకాల సమస్యలతో రాగ వీరందరికీ పరీక్షలు నిర్వహించి వివిధ రకాల సమస్యలు పై దాదాపు 60 వేల రూపాయల మందులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ మారుమూల గ్రామాల గిరిజన ప్రజలకు సరైనా హాస్పిటల్స్ అందుబాటులో లేక అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారని ఉద్దేశంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి మౌనిక ఐపీఎస్, డిండి సి.ఐ సురేష్,చందంపేట ఎస్సై సతీష్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
