
సైబర్ నెరలపై, అక్రమ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ వలన కలుగు అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.
స్టేషన్ పరిధిలోని రౌడి,హిస్టరీ షీటర్స్ పై నిఘా ఉంచి తరచు తనిఖీ చేయాలి. కొనరావుపేట పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపిఎస్.,కొనరావుపేట పోలీస్ స్టేషన్ ని సందర్శించి స్టేషన్ పరిసరాలు,స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో స్వాదీనం చేసుకున్న వాహనాల వివరాలు,స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న,నమోదైన కేసుల వివారలు, స్టేషన్ రికార్డ్ లు పరిశీలించి, పెండింగ్ కేసులపై అరా తీసి త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందిస్తూ ,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకొని,బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
అధికారులు,సిబ్బంది పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ,హిస్టరీ షీటర్స్ లను అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచుతూ తనిఖీ చేయాలని,విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు,యువతకు సైబర్ నెరలపై, అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ వలన కలుగు అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పి వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి, ట్రెని ఎస్.ఐ రాహుల్ రెడ్డి ,సిబ్బంది ఉన్నారు.
