రేషన్ కార్డుదారులకూ ఈకేవైసీ నమోదు తప్పనిసరి అయింది. ఇప్పటికీ చేయించుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలుండదని అధికారులు చెబుతున్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం జాతీయ సమాచార సంస్థ (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ నవీకరిస్తున్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ లేకున్నా సరకులు ఇచ్చేవారు. ఇకపై అలా కుదరదని, నమోదు చేసుకోని వారంతా వెంటనే చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఈకెవైసి పెండింగ్ ఉన్నవారి వివరాలు ఆయా పంచాయితీలకు రెవెన్యూశాఖ సమాచారం అందించింది. తెలంగాణ ప్రభుత్వం
