ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి, జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రతి గ్రామానికి ఒక పోలీసు అదికారి.
జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి,ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రేపటి నుంచి ప్రతి గ్రామానికి ఒక విలేజ్ పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామానికి వీపీఓ క్రమం తప్పకుండా కేటాయించిన గ్రామాలను సందర్శించి ఆయా గ్రామంలో ఉన్న సమస్యల పట్ల పై అధికారులకు తెలుపుతూ పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. అలాగే నేరాల అదుపునకు గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యల గురించి తెలుసుకుంటూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం వలన గ్రామంలో ఉన్న నేరస్తులు వారి యొక్క కదలికలను మరియు గ్రామానికి కొత్తగా వచ్చే అనుమానితుల యొక్క సమాచారం తెలుసుకోవడం వల్ల గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామాల్లో మధ్యవర్తులు, పెద్దమనుషుల యొక్క ప్రభావం అమాయక ప్రజల సమస్యల విషయంలో పడకుండా నేరుగా ఫిర్యాదారుడు ఎటువంటి భయాందోళన లేకుండా నేరుగా పై అధికారిని కలిసే విధమైన వాతావరణాన్ని విపిఓ కల్పించే విధంగా చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.దీని ద్వారా ప్రజా సమస్యల పైన సామాన్య బాధితులు పోలీసు స్టేషన్ కి వస్తే న్యాయం జరుగుతుందని నమ్మకం ప్రజల్లో కలుగుతుందని అన్నారు.