నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలు
నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించుకున్న పోలీసుయాన్వల్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా రోడ్డు మరియు భావనల శాఖ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విచ్చేసి వివిధ ఆటలలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.
దాదాపు మూడు సబ్ డివిజన్ లో నుండి 300 మంది ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు.ఈ క్రీడలో కబడ్డీ, వాలీబాల్,ఫుట్ బాల్, క్రికెట్, తగ్ ఆఫ్ వార్ క్రీడలలో ఏ.ఆర్ నల్లగొండ జట్లు ప్రథమ బహుమతిగా గెలుపొందగా,నల్లగొండ సబ్ డివిజన్ క్రీడాకారులు ద్వితీయ బహుమతి గెలుపొందారు..ఓవర్ అల్ చాంపియన్ షిప్ గా ఏ.ఆర్ జట్టు బహుమతిని స్వీకరించారు..





