ఈ సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు విధాయి పరేడ్ నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించిన ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లాలో మెరుగైన సేవలను అందించడంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతగానో ఉందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎస్పీగా నా మొదటి పోస్టింగ్ సంగారెడ్డి జిల్లా అని, సంగారెడ్డి జిల్లాతో నాకున్న అనుబంధం ఎప్పటికీ మరచిపోలేను అన్నారు. అధికారులను, సిబ్బందిని ఎవరినైనా మందలించిన అది డ్యూటిలో భాగమేనని అన్నారు. క్యాంప్ కార్యాలయం సిబ్బంది నన్ను అమ్మలా చూసుకున్నారని గుర్తు చేశారు.
అనంతరం పుష్ప గుచ్ఛములతో అలంకరించిన పోలీసు వాహనంలో ఎస్పీ మరియు వారి కుటుంబ సభ్యులను పరేడ్ గ్రౌండ్ నుండి కార్యాలయ ఆవరణ వరకు తీసుకురావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, ఎఆర్ డీఎస్పీ నరేందర్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


