బ్రేకింగ్ న్యూస్
కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతకురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రత
Hyderabad

రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

రాజేంద్రనగర్, హైదరాబాద్ | 28.09.2026

రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం. 1125/2026, సెక్షన్ 103(1), 61 r/w 3(5) BNS కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ ఘటన 24.09.2026 వ తేదీన సాయంత్రం సుమారు 5:36 గంటలకు రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లి, పిల్లర్ నెం. 185 సమీపంలోని హ్యాపీ హోమ్స్, టవర్ నెం. 4 ఎదురుగా ఉన్న షామ్స్ టెయిలర్ షాప్ దగ్గర చోటుచేసుకుంది.

మృతుడు మొహమ్మద్ నసీరుద్దీన్ అహ్మద్ ఖాన్ అలియాస్ వసీమ్ (34) పై గతంలో ఉన్న పాత కక్షల కారణంగా నిందితులు కత్తితో మరియు ఇతర వస్తువులతో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుబోయిన మరొక వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు 28.09.2026 వ తేదీన ఈ క్రింది ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు:

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం
  1. మొహమ్మద్ ఇలియాస్ (28), (01 కేసులో ప్రమేయం గలదు).
  2. మొహమ్మద్ షోయబ్ అలియాస్ సోహెబ్ (22), (05 కేసులలో ప్రమేయం గలదు).
  3. షేక్ సుల్తాన్ (23).

దర్యాప్తు సమయంలో నిందితుల నుండి నేరానికి ఉపయోగించిన కత్తి, మెటల్ నకిల్, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ మరియు రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాత కక్షల కారణంగానే నిందితులు పథకం ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయపరమైన రిమాండ్ నిమిత్తం గౌరవనీయ కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది

(శ్రీ టి. శ్రీనివాస్)
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
రాజేంద్రనగర్ డివిజన్, హైదరాబాద్.
news for website