తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.
మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 జనవరి 31 అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకోగా ఇది నచ్చని అమృత తండ్రి మారుతీ రావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయ్ ను అతి కిరాతకంగా చంపారు. ఇదే విషయంపై మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రణయ్ తండ్రి పెరుమల్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు నిందితులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ సీట్ దాఖలు చేయగా,ఐదేళ్ల పాటు కొనసాగిన వాదోపవాదల అనంతరం ఇవాళ నిందితుల్లో A1 మారుతి రావు చనిపోగా A2 సుభాష్ శర్మకు ఉరి శిక్ష అదేవిధంగా కేసులో ఏ3 మహమ్మద్ అస్గర్ అలీ, ఏ4 మహమ్మద్ అబ్దుల్ బారి, ఏ5 మహమ్మద్ అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరి శ్రవణ్, ఏ 7 సముద్రాల శివ, ఏ8 యం.ఏ నిజాం జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించడం జరిగింది.