మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎస్పీ డా. శబరీష్, ఐ.పి.ఎస్.
మహబూబాబాద్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐ.పి.ఎస్. ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను, ఆయన పాటించిన అహింస, సత్యం, శాంతి వంటి విలువలను స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు నేటి ఆధునిక పోలీసు వ్యవస్థకు కూడా ఎంతో మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ప్రతి పోలీసు సిబ్బంది గాంధీజీ జీవితం, సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొంది ప్రజలకు మరింత చేరువగా ఉంటూ నిబద్ధత, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, మత సామరస్యం, ప్రజల రక్షణ కోసం పోలీసులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ప్రతి పౌరుడి హక్కులను గౌరవిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం వంటి గాంధీయ సూత్రాలకు అనుగుణంగా ప్రజలతో మమేకమై పనిచేయాలని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘపతి రెడ్డి, ఆర్.ఐలు భాస్కర్, నాగేశ్వరరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
