బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Telangana

10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి.. పట్టీలు అందజేసిన జిల్లా ఎస్పీ

10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి.. పట్టీలు అందజేసిన జిల్లా ఎస్పీ

జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పదోన్నతి పొందిన సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్ పట్టీలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, బాధ్యతలు కూడా మరింత పెరిగినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, అంకితభావం, సేవా తత్పరతను అదే స్థాయిలో కొనసాగిస్తూ కొత్త హోదాలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రతి పోలీసు ఉద్యోగి పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ అన్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవాభావంతో పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషించాలని పదోన్నతి పొందిన సిబ్బందికి సూచించారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

తమ పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, సహచరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించిన ఎస్పీ, పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ సంతోష్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పదోన్నతి పొందిన వారిని అభినందించారు.