బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Telangana

ధర్మపూర్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు.. రుద్ర జాగిలంతో హోటళ్లు, షాపుల పరిశీలన

ధర్మపూర్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు.. రుద్ర జాగిలంతో హోటళ్లు, షాపుల పరిశీలన

ధర్మపూర్: మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్మపూర్ గ్రామ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రుద్ర అనే పోలీసు జాగిలం సహాయంతో గ్రామంలోని పలు హోటళ్లు, షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని, ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి జిల్లా పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో ఆర్ఐ కృష్ణయ్య, ఆర్ఎస్ఐ రమేష్, డాగ్ హ్యాండ్లర్ శంకర్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.