బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Telangana

జైళ్లలో మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం.. 15,645 మంది ఖైదీలకు డీ-అడిక్షన్ సేవలు

జైళ్లలో మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం.. 15,645 మంది ఖైదీలకు డీ-అడిక్షన్ సేవలు

హైదరాబాద్, జూన్ 25: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ అన్ని జైళ్లలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఖైదీల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవన విధానాలను ప్రోత్సహించడం, పునరావాస కార్యక్రమాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు.

హైదరాబాద్ సెంట్రల్ జైలులో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య మిశ్రా ‘నివృత్తి’ డీ-అడిక్షన్ సెంటర్ అధికారిక లోగోను ఆవిష్కరించారు. డ్రగ్స్ నివారణ, చికిత్స, పునరావాసంపై అవగాహన కల్పించే పోస్టర్లను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్, ప్రతిజ్ఞా స్వీకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ మధ్య వరకు హైదరాబాద్, చెర్లపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి కేంద్ర కారాగారాల్లోని డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా మొత్తం 15,645 మంది ఖైదీలకు సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4,200 మంది మాదకద్రవ్యాలపై ఆధారపడిన వారిగా గుర్తించి చికిత్స, పునరావాస సేవలు అందించారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

స్క్రీనింగ్‌లో గంజాయి వినియోగం అత్యధికంగా 1,563 కేసులు నమోదుకాగా, కల్తీ కల్లు వినియోగం 815 కేసులతో ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఎండీఎంఏ, మెథాంఫెటమైన్, ఎల్ఎస్డీ, కొకైన్, ఓపియాడ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగ కేసులను కూడా గుర్తించారు.

జూన్ 26న యూఎన్వోడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ సదస్సులో తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న ‘నివృత్తి’ డీ-అడిక్షన్ కేంద్రాల ఉత్తమ విధానాలపై డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ నమూనాను ఇతర రాష్ట్రాలతో పంచుకోనున్నట్లు అధికారులు తెలిపారు.