బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Telangana

మాదకద్రవ్యాలకు నో… లక్ష్యాలకు యెస్: విద్యార్థులతో కలిసి గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్

మాదకద్రవ్యాలకు నో… లక్ష్యాలకు యెస్: విద్యార్థులతో కలిసి గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, జూన్ 24: యువత భవిష్యత్తును కాపాడాలంటే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన “మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో 9వ, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎస్పీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత జీవితాలను, వారి విద్యా భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ఒకసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం ప్రభావితమవుతాయని హెచ్చరించారు.

విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించిన ఆయన, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు సంపాదించాలని కోరారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు మరియు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. “నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

“Say No To Drugs – Say Yes To Life” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని ఎస్పీ కోరారు. అనంతరం గంజాయి వ్యతిరేక సందేశాలతో రూపొందించిన “Say No To Drugs” పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి ప్రదర్శించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను సమాజానికి తెలియజేయడంలో యువత ముందుండాలని సూచించారు.

నాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన “Wall of Promise” వద్ద విద్యార్థులందరితో కలిసి ఎస్పీ గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ తోటి విద్యార్థులను కూడా చెడు అలవాట్ల బారిన పడకుండా చైతన్యవంతులను చేస్తామని ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు వాల్ ఆఫ్ ప్రామిస్‌పై సంతకాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గంజాయి రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు.

యువతలో అవగాహన పెంపొందించడం ద్వారానే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్న ఎస్పీ, గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ మరియు EAGLE ఫోర్స్ చేపడుతున్న కార్యక్రమాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొంటూ, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.