బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

జిల్లా స్థాయి 3వ పోలీస్ డ్యూటీ మీట్–2026 ప్రారంభం

జిల్లా స్థాయి 3వ పోలీస్ డ్యూటీ మీట్–2026 ప్రారంభం

పోలీసు నైపుణ్యాల ప్రదర్శనకు డ్యూటీ మీట్ ఉత్తమ వేదిక: అదనపు ఎస్పీ చంద్రయ్య

జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి 3వ పోలీస్ డ్యూటీ మీట్–2026ను అదనపు ఎస్పీ చంద్రయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచనల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

అదనపు ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు విధుల్లో సమర్థవంతంగా రాణించాలంటే నేర దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణ వంటి అంశాల్లో నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ఫోరెన్సిక్ సాంకేతికతలు, నేర పరిశోధనలో ఉత్తమ విధానాలపై అవగాహన పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పోలీసు అధికారులు, సిబ్బంది చట్టాలపై సంపూర్ణ అవగాహనతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. శాస్త్రీయ ఆధారాలతో నేరస్థులను న్యాయస్థానంలో దోషులుగా నిరూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.

డ్యూటీ మీట్ ద్వారా అధికారులు, సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న ఆలోచనలను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

ఈ డ్యూటీ మీట్‌లో కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్స్, యాంటీ-సబోటేజ్ చెకింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుండగా, జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో విజేతలకు విశేష గుర్తింపు లభిస్తుందని అదనపు ఎస్పీ తెలిపారు.

కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు రవి, నాగేశ్వరరావు, రవీందర్, వెంకటేష్, ఆర్‌ఐ సురేష్, ఎస్‌ఐలు, ఆర్‌ఐఎస్‌లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.