సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు : సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ.
ఈ సందర్భంగా టౌన్ సీఐ మాట్లాడుతూ జిల్లా అధికారులను కించపరిచేవిధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన గుండారపు గణేష్, ఆకుల శ్రీనివాస్ రెడ్డి పై కేసులు నమోదు చేయడంతో పాటు మరి కొంత మంది పైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లా అధికారుల గురించి, వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి అసభ్యకర పోస్టులు పెడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
అధికారులు, ఇతరులను కించపరిచేవిధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా సామాజిక మాధ్యమాలు పోస్టులు చేసిన వారిపై, గ్రూప్ అడ్మిన్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా సీఐ తెలిపారు.