నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన మిషన్ పరివర్తన్ యువ తేజం కార్యక్రమంలో భాగంగా క్రీడా స్ఫూర్తితో హోరా హోరీగా సాగిన కబడ్డీ క్రీడా పోటీలు ..
జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేసారు ..
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ యువతకు మిషన్ పరివర్తన్ యువ తేజం అనే కార్యక్రమంలో ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపు 450 జట్లు గత 15 రోజులుగా మండల స్థాయి,డివిజన్ స్థాయిలలో నిర్వహించి గెలుపొందిన అభ్యర్థులకు శనివారం యం.జి కళాశాల మైదానంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది.

ఈ కబడ్డీ క్రీడా ముగింపు పోటీలకు జిల్లా ఎస్పీ ముఖ్యతిదిగా పాల్గొని వీక్షించి మొదటి బహుమతిగా మిర్యాలగూడ,రెండవ బహుమతిగా నల్లగొండ,మూడవ బహుమతిగా దేవరకొండ జట్లకు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
పోలీస్ శాఖ నిర్వహించిన కబడ్డీ పోటీల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటి హోరా హోరీగా పోరాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ గ్రామీణ యువతలో ఉత్సాహం పెంపొందిస్తుంది క్రీడా నైపుణ్యాలు వెలికితీసి వారిలో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, స్నేహ భావం పెంపొదించుటకు గాను మరియు పోలీసులకు మరియు యువత మధ్య స్నేహ భావం పెంపొందిస్తూ నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా యువత చెడు వ్యసనాలకు బానిసై, పెడ దారిన పడకుండా ఈ క్రీడలు నిర్వహించడం జరిగిందని అన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజం అని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. జీవితంలో ముందుకు సాగాలంటే క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యాయామ ఉపాధ్యాయులకి, ఆర్గనైజర్లకి, పోలీస్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పి మౌనిక ఐపీఎస్,యస్. బి డీఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,డీఎస్పీ విఠల్ రెడ్డి,సిఐలు రాజశేఖర్ రెడ్డి, నాగరాజు,కరుణాకర్,ధనంజయ, ఆర్.ఐ సురప్పా నాయుడు,యస్.ఐలు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.