బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ – డి.సి.పి.

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, గోల్కొండ జోన్ పరిధిలోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 06:00 గంటల నుండి 08:00 గంటల వరకు ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ (నేర నియంత్రణ తనిఖీలు) నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం గోల్కొండ జోన్ డి.సి.పి. జి. చంద్ర మోహన్ పర్యవేక్షణలో, అడిషనల్ డి.సి.పి. బి. కృష్ణ గౌడ్, గోషామహల్ ఏ.సి.పి. ఎస్. సుదర్శన్, కుల్సుంపురా ఏ.సి.పి. వి. తిరుపతి, మంగళ్‌హాట్ ఇన్ స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, అడిషనల్ ఇన్ స్పెక్టర్ పి. మహేందర్ మరియు గోల్కొండ జోన్ పరిధిలోని ఎస్.హెచ్.ఓ.లు, సి.ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్ సిబ్బందితో కలిపి మొత్తం 184 మంది వివిధ హోదాల పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ క్రింది ప్రాంతాల్లో ముమ్మరంగా ఇండ్ల సోదాలు మరియు ధృవీకరణలు చేపట్టారు: జుమ్రాత్ బజార్‌లోని లాలాభవన్ నుండి రాహుల్ ఫుట్‌వేర్ వరకు,లాలాభవన్ నుండి కున్నా పాన్ షాప్ వరకు,లాలా తాలీమ్ నుండి టక్కర్‌వాడి వరకు,బుధే బాబా హనుమాన్ దేవాలయం నుండి టక్కర్‌వాడి మరియు లోయర్ ధూల్‌పేట్ పరిసర ప్రాంతాలు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని మరియు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ క్రింది వాటిని స్వాధీనం చేసుకున్నారు: ద్విచక్ర వాహనాలు: 28, అక్రమ మద్యం (IMFL): సుమారు 49.4 లీటర్ల విస్కీ మరియు బీరు సీసాలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు (ఖాళీ): 22, డొమెస్టిక్ (గృహ అవసరాల) గ్యాస్ సిలిండర్లు: 12, చిన్న గ్యాస్ సిలిండర్లు: 79. ఈ కార్యక్రమం అత్యంత క్రమశిక్షణతో, ప్రజల శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిర్వహించబడింది. సామాన్య పౌరులలో భద్రతా భావాన్ని పెంపొందించడం, అసాంఘిక శక్తులపై నిఘా ఉంచడం మరియు నేరస్తులలో భయాన్ని కలిగించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశ్యం.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్