బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Hyderabad

కాటెదాన్‌లో కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాల తయారీ బట్టబయలు.. ముగ్గురు అరెస్ట్

కాటెదాన్‌లో కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాల తయారీ బట్టబయలు.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని కాటెదాన్ ప్రాంతంలో పిల్లల తినుబండారాల తయారీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు మరియు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్న అక్రమ యూనిట్‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్. శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన మెరుపు దాడిలో “మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ” పేరుతో నడుస్తున్న ఈ కేంద్రాన్ని గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

అరెస్టైన వారిలో అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32), మరియు ఖత్రేషన్ ఉన్నారు. వీరు కాటెదాన్‌లోని ఇంద్ర సొసైటీ పరిధిలో అనుమతి లేకుండా ఆహార తయారీ కేంద్రాన్ని నడుపుతూ, బయట మార్కెట్ నుండి కుళ్లిపోయిన మరియు పగిలిపోయిన కోడిగుడ్లను సేకరించి వాటికి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి డోనట్స్, కేకులు తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఆహార పదార్థాలు అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారవుతున్నాయని, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అవకాశముందని అధికారులు తెలిపారు. దాడిలో భాగంగా పోలీసులు సుమారు 330 కుళ్లిపోయిన కోడిగుడ్లు, సోడియం బెంజోయేట్ (15 కిలోలు), సోర్బిక్ యాసిడ్ (15 కిలోలు), పొటాషియం సోర్బేట్ (20 కిలోలు), పీజీపీఆర్ లిక్విడ్, అమ్మోనియా సల్ఫైట్ వంటి రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తయారైన డోనట్స్, కేకులు సుమారు 150 కిలోలు, డాల్డా 120 కిలోలు, మిల్క్ పౌడర్ 25 కిలోలు, మిక్సింగ్ మెషీన్లు, స్పైరల్ మెషీన్, ఓవెన్లు, వెయింగ్ మెషీన్‌లను కూడా సీజ్ చేశారు.

గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్

నిందితులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 268/2026 కింద కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని అధికారులు అభినందించారు.