
మిషన్ పరివర్తన్-యువతేజం కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్- యువతేజం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను హలియ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన క్రీడల వల్ల గ్రామీణ యువతకు పోలీసులకు మధ్య స్నేహ భావం పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా యువత చెడు మార్గంలో పక్కదారి పట్టకుండా సక్రమ మార్గంలో ఉండేందుకు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం,శారీరక దారుఢ్యం కలుగుతుందని అన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని ఆటలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. మిషన్ యువ తేజం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా యువత ఉత్సాహవంతంగా అన్ని మండలాల పరిధిలో కలిపి దాదాపు 370 టీమ్ లు నమోదు చేసుకోవడం జరిగిందనీ వీరందరికీ మండల,డివిజన్ పరిధిలో నిర్వహించి గెలుపొందిన జట్లను జిల్లా స్థాయిలో నిర్వహించబడతాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు హలియ సిఐ జనార్ధన్ గౌడ్,యస్.ఐలు గోపాల్ రావు,ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయుల మరియు యువత పాల్గొన్నారు.
