బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం – విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు చేయూత

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం – విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు చేయూత

నల్లగొండ, ఫిబ్రవరి 27: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్‌.ఐ దుర్గా రెడ్డి, ఏఎస్ఐలు ఫరీద్, నిరంజన్‌లను జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar, ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో విధులు నిర్వహించడం ఒక బాధ్యతాయుతమైన సేవ అని, ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో వారు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. విధుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిబద్ధతతో పనిచేసిన ఈ అధికారుల సేవలు శాఖకు ఆదర్శప్రాయమని అన్నారు.

పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ వారికి శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు.


🕊️ విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు చేయూత

ఇటీవల విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది షేక్ తాయూబ్, మరియాదాస్‌ల కుటుంబ సభ్యులు సభానా, లక్ష్మిలను ఎస్పీ పరామర్శించారు. పోలీస్ కార్యాలయంలో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎస్పీ, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన సిబ్బంది సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగం పోలీస్ శాఖకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు పోలీస్ సంక్షేమ నిధి ద్వారా కూడా అవసరమైన సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. పిల్లల విద్య, కుటుంబ భద్రత వంటి అంశాలలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఏవో శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, కుటుంబ సభ్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.