బ్రేకింగ్ న్యూస్
వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Telangana

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ తనిఖీలు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ తనిఖీలు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు అక్రమంగా సరఫరా కాకుండా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా పలు చెక్ పోస్టులు, తనిఖీ కేంద్రాలను పరిశీలించి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు, పట్టణ పరిధుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని, అనుమానాస్పద వాహనాలు మరియు వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

తనిఖీల్లో భాగంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, మద్యం, నగదు, గిఫ్ట్ వస్తువులు తరలిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

అలాగే, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ కోరారు.

ఈ తనిఖీ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్.ఐ గోపాల్ రావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.