బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు

బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు

బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు

ఇటుకబట్టీల యాజమాన్యాలు, నిర్వహులకు బాల కార్మిక చట్టాలపై అవగాహన

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు లేబర్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటుకబట్టీల యాజమాన్యాలు, నిర్వహులతో అవగాహనా సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే జిల్లా పరిధిలోని ఇటుకబట్టీల యాజమాన్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు పిల్లలను ఏ రూపంలోనైనా పనిలో పెట్టుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలపై బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇటుకబట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు చదువు, ఆరోగ్యం, భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని పేర్కొంటూ, పిల్లలను పనిలో పెట్టకుండా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

బాలకార్మికులను పనిలో పెట్టుకున్నట్లు సమాచారం అందిన పక్షంలో, పోలీస్ శాఖ మరియు లేబర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత యాజమాన్యాలపై చైల్డ్ లేబర్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాలని, ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్‌లైన్ లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నట్లు లేదా బాలకార్మికులుగా పనిచేస్తున్నట్లు ఎక్కడైనా గమనించినట్లయితే, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారి హరిత, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అరుంధతి, ఏ.హెచ్.టి.యూ ఎస్‌ఐ రంగారెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.