బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి.

బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి.

బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి.

బాల కార్మిక వ్యవస్థపై జీరో టాలరెన్స్ విధానం అమలు.

చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చెపిస్తే క్రిమినల్ కేసులు తప్పవు.

జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం.

బాలకార్మికులు కనిపిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ 1098,పోలీస్ వారికి సమాచారం అందించండి.

జిల్లా ఎస్పీ గారితో కలసి సమావేశం నిర్వహించిన ఎస్‌సిపిసిఆర్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారితో కలసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన .

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

జిల్లాలో జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన అన్నారు.

ఈసందర్భంగా చందన మాట్లాడుతూ…చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం,పనులలో పెట్టుకోవడం నేరమని,అలా చేస్తే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంను కఠినంగా అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే బాలల రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.అదేవిధంగా రానున్న రోజుల్లో మళ్లీ ఈ పిల్లలు బాల కార్మికులుగా మారకుండా వారికి పునరావాస కార్యక్రమాలు చేపట విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత వివిధ శాఖల అధికారులపై వుందని, బాల కార్మిక రహిత సమాజమే మనందరి లక్ష్యం పనిచేయాలని తెలియజేసారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ….బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, బాల కార్మికులపై ఫిర్యాదులు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు జరిగే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమానికి అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ డివిజన్ లలో ఎస్.ఐ స్థాయి అధికారి వివిధ శాఖల అధికారులతో రెండు టీమ్ లు ఏర్పాటు చేసి జిల్లాలో పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు,హోటల్స్,వ్యాపార సముదాయాలు, గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

18సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయుస్తున్న వారిపై 2025 సంవత్సరంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ లో 22 మందిపై క్రిమినల్ కేసులు చేసి 129 సంరక్షించడం జరిగిందని ఈసందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు.

ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,dwo లక్ష్మీరాజాం,CWC చైర్పర్సన్ అంజయ్య, ఎస్.ఐ లు,వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..