బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకుందాం

ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకుందాం

ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకుందాం.

డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ , బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు.

డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం – ఉల్లంఘిస్తే కేసులు తప్పవు.

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే,వాహనాల యజమానులపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.

న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు.

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.,

ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులతో కలసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

డిసెంబర్ 31న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని,ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు,అధిక శబ్దం వచ్చే బాక్స్‌లు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.

పోలీసుల సూచనలు –

● డిసెంబర్ 31న టపాసులు, మైకులు వినియోగించి ప్రజలను ఇబ్బంది పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటాం.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

● డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డీజేలు పూర్తిగా నిషేధం. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే డీజేలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.

● మద్యం మత్తులో వాహనాలు నడపడం,ర్యాష్ డ్రైవింగ్ చేయడం,వాహనాల సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టింసిచిన ,త్రిబుల్ రైడింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కేసులతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.

● ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులు, వీధి దీపాలపై రాళ్లు వేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళలను ఇబ్బంది పెట్టడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

● నూతన సంవత్సర వేడుకలలో నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

● బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తాం.

● మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం. వారి వల్ల ప్రమాదం జరిగితే సంరక్షకులపై కూడా చర్యలు తీసుకుంటాం.

పై నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలు వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ప్రజలు,యువత నూతన సంవత్సర వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు.

2026 సంవత్సరంలో ప్రజలందరికి మంచి కలగాలని ఆశిస్తూ , జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు…