
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం కార్యనిర్వాహణ అధికారి డాక్టర్ రజిని ప్రియ మాట్లాడుతూ.గత మూడేళ్లుగా రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తేనెలొలుకు భాష. మన తెలుగు భాష. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష అని అన్నారు.
