
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ – యువతేజం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువత యొక్క క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు గాను కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల గ్రామీణ యువకులు తమ యొక్క టీం సభ్యుల పేర్ల జాబితాను సంబంధిత పోలీస్ స్టేషన్ లో తేది 02-02-2025 లోపు నమోదు చేసుకోగలరని పేర్కొన్నారు.
- తేది 03-02-2025 నుంచి 09-02-2025 వరకు మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు.
- గెలుపొందిన అభ్యర్థులకు మొదటి బహుమతిగా 5000 రూపాయలు ద్వితీయ బహుమతి గా 2500 రూపాయలు తృతీయ బహుమతిగా 1500 రూపాయలు బహుకరించబడును.
- మండల స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు తేది 10-02-2025 నుంచి 16-02-2025 వరకు డివిజన్ మరియు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు.
- డివిజన్ స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు ప్రథమ బహుమతిగా 10000 రూపాయలు, ద్వితీయ బహుమతి గా 5000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2500 రూపాయలు బహుకరించబడును.
- డివిజన్ స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయిలు పోటీలు నిర్వహించబడును.
- జిల్లా స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు మొదటి బహుమతిగా గా 25000 రూపాయలు,ద్వితీయ బహుమతిగా 15000 రూపాయలు, తృతీయ బహుమతిగా 10000 రూపాయలు బహుకరించబడును.కావున జిల్లా యువకులు ఉత్సాహంగా పాల్గొనగలరని అన్నారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి కబడ్డీ పోటీల సంబంధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్బి డియస్పి రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు,2 టౌన్ సిఐ రాఘవరావు పాల్గొన్నారు.
