గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ టి.గంగారాం జాతీయ జెండా ఎగురవేసి పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కమాండెంట్ టి . గంగారాం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారని తెలియజేశారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందన్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. 1930 జనవరి 26న లాహోర్ లో ప్రప్రథమంగా జాతీయ జెండా ఎగురవేసి పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు.అందుకే జనవరి 26కు ఒక ప్రత్యేకత ఉందని,1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని తెలిపారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26ను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినల శ్రీనివాస్(ARSI-101), శ్యాంరావు (ARSI-79), రాంసింగ్ (ARSI-104), అనుదు సింగ్ (ARSI- 105)గారికి ఉత్కృష్ట సేవా పథకాలను కమాండెంట్ టి. గంగారాం అలంకరించారు మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్.ఐ. శ్రీధర్ , ఆర్.ఎస్.ఐ. స్వామి రంగయ్య పి.రమేష్ ( ARSI-725) జె.ప్రవీణ్ (Hc-370) దినకరన్ (PC-906) కలెక్టరు గారు ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్, రాందాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.ప్రమీల, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.