
ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, వారి సమస్య స్థితి, జాప్యానికి గల కారణాలను సంబంధిత ఎస్.హెచ్.ఓ కు ఫోన్ ద్వారా మాట్లాడి. వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడం ఎలాంటి అలసత్వం చూపరాదని, చట్టప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ. లకు సూచనలు చేయడం జరిగింది. జిల్లా ప్రజలు తమ సమస్యకు స్థానికంగా పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా జిల్లా ఎస్పీ సూచించారు.
