
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో బాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తన్ అనే కార్యక్రమం ద్వారా మాదకద్రవాలకు అలవాటు పడిన అనేక మందిని కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల క్రయ, విక్రయాల పై ప్రత్యేక నిఘా పెట్టీ తేదీ 23.08.2025 మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో నకిరేకల్ పోలీసులకు నకిరేకల్ పట్టణ శివారు లోని తాటికల్ రోడ్ లోని కుమ్మరి బావి దగ్గర్లోని చెట్ల పొదల వద్ద అక్రమంగా గంజాయి అమ్ముచున్నారని నమ్మదగిన సమాచారం రాగా యస్.ఐ తన సిబ్బంది తో యుక్తంగా అక్కడికి వెళ్ళి అక్రమ గంజాయి విక్రయిస్తున్న మరియు కొనుక్కొని సేవిస్తున్న ఆరుగురు నిందితులను మరియు ఒక JCL ను పట్టుకొని వారి వద్ద నుండి (01) కిలోల (290) గ్రాముల గంజాయి, (07) సెల్ ఫోన్ లు, ఒక స్కూటి, ఒక మోటార్ సైకిల్ మరియు ఒక ఆటొను నిందితుల నుండి స్వాధీనపరచుకొని విచారించగా. 1).సమీర్, నివాసం: నల్లగొండ (పరారీ),2).బోరిగం సంపత్ కుమార్ తండ్రి వెంకటయ్య, 3).యన్నమల్ల సాయిరాం @ Y. సాయి తండ్రి కృష్ణయ్య, 4).ముక్కాముల అఖిల్ తండ్రి ఇస్తారి, 5).పల్లెబోయిన శివ @ కట్ట శివ తండ్రి వెంకన్న, 6).బండారి వినయ్ తండ్రి శ్రీను, 7).కుంచం నవీన్ తండ్రి వెంకన్న, 8). ఒక బాల నేరస్థుడు. ఇట్టి గంజాయిని నల్లగొండ పట్టణానికి చెందిన A-1 & A-2 అనువారు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తూ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో, A-1 గంజాయిని తనకు తెలిసిన వారి వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసుకొని A-2 వద్దకు రాగ, ఇద్దరు కలిసి నల్లగొండ, నకిరేకల్ మరియు సూర్యపేట పట్టణాలలో అమ్ముతుంటారు. అదే క్రమంలో నకిరేకల్ కు చెందిన A-3 & A-4 అను వారిని పరిచయం చేసుకొని వారికి ఎక్కువ ధరకు గంజాయిని విక్రయిస్తాడు. వీరు గంజాయి సేవించడం అలవాటు ఉన్న వారికి పరిచయం ఉన్న A-5, A-6, A-7 & JCL-1 లకు ఒక్కొక్కరికి 50 గ్రాముల చొప్పున అమ్ముతున్నామని ఒప్పుకోగా వారి వద్ద నుండి సుమారు 32,250/- రూపాయల విలువ గల (01) కిలోల (290) గ్రాముల గంజాయి, (07) సెల్ ఫోన్ లు, ఒక స్కూటి, ఒక మోటార్ సైకిల్ మరియు ఒక ఆటొను స్వాధీన పరుచుకొని వారిని రిమాండ్ కి మరియు Juvenile Home కి తరలించడం జరుగుతుంది. A-1 సమీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఇతని కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో పట్టుబడి చేసి గంజాయి ఎక్కడ నుండి విక్రయిస్తున్నారు అనే పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. ఇట్టి కేసులో నిందితులను నల్లగొండ డిఎస్‌పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నకిరేకల్ సి.ఐ.వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టుబడి చేసిన ఎస్.ఐ. బి. లచ్చిరెడ్డి,ఎస్.ఐ. జి. క్రిష్ణా చారి మరియు సిబ్బంది వై. వెంకటేశ్వర్లు, కె. జనార్ధన్, బి. మధుకర్, M. శ్రీనివాస్,ముజీబ్,వి. సురేష్, డి. శ్రీకాంత్,యం. నాగార్జున్ లను జిల్లా యస్పీ అభినందించారు.
