బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుగచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు
Uncategorized

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ జోనల్ సైబర్ సెల్స్‌ పనితీరును సమీక్షించారు.

సి.వి. ఆనంద్,ఐపిఎస్ డిజి , కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు 7 జోనల్ సైబర్ సెల్స్ (ZCCలు) గత రెండు నెలల్లో చేసిన పనితీరుపై సమీక్ష సమావేశము నిర్వహించినారు. ముఖ్యంగా, ఆరు కీలక అంశాలపై కమిషనర్ చర్చించినారు: 1.NCRP ఫిర్యాదులను పరిష్కరించడం. 2.మోసపోయిన డబ్బును తిరిగి ఇప్పించడం (రీఫండ్స్). 3.కేసుల దర్యాప్తు. 4.ప్రజలకు అవగాహన కల్పించడం. 5.రాష్ట్రాల మధ్య సమన్వయం. 6.CCTNSలో సమాచారాన్ని నమోదు చేయడం.
జోనల్ సైబర్ సెల్స్ సాధించిన అద్భుతమైన పురోగతిని ఆ వివరాలు ఈ కింద తెలిపిన విధంగా ఉన్నాయి:
• ఫిర్యాదుల పరిష్కారం: ఫిర్యాదుల పరిష్కారంలో 65.15% పెరుగుదల నమోదైంది. గత రెండు నెలల్లో 8,209 ఫిర్యాదులు పరిష్కరించారు. అంతకుముందు ఇది 4,970 మాత్రమే.
• డబ్బు తిరిగి ఇవ్వడం: 768 కేసులలో మొత్తం ₹1,41,72,664 తిరిగి ఇప్పించారు. ఇది 87.03% పెరుగుదల.
• సమాచారం నమోదు: CCTNSలో సమాచారం నమోదు చేయడంలో 680% వృద్ధి కనిపించింది. ఇది మెరుగైన పనితీరుకు నిదర్శనం.
• రాష్ట్రాల మధ్య సమన్వయం: సైబర్ నేరాలను అరికట్టడానికి సమన్వయ పోర్టల్ను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల దర్యాప్తు వేగవంతమైంది.
ఈ సమీక్షలో పైన తెలిపిన జోనల్ సైబర్ సెల్స్ సాధించిన అద్భుతమైన పురోగతిని కమిషనర్ వారిని ప్రశంసించారు.
సి.వి. ఆనంద్ ఐపిఎస్ సమీక్షలో నేరుగా DIలు, SIలు, PCలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి చొరవ సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కోవడానికి వారికి మరింత శక్తిని ఇస్తుంది. ప్రజలలో సైబర్ నేరాలపై అవగాహన పెరుగుతున్న తీరును కూడా పోలీస్ కమిషనర్ అభినందించారు. సురక్షితమైన డిజిటల్ వ్యవస్థ కోసం ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని చెప్పారు. సైబర్ మోసాల కేసులను త్వరగా పరిష్కరించడానికి బ్యాంకులు, టెలికాం సంస్థలు, న్యాయ సంస్థలతో కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు. నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను పై నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో పి. విశ్వ ప్రసాద్, అడిషినల్ సిపి(క్రైం), శ్రీమతి దారా కవిత, డిసిపి సైబర్ క్రైం మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పౌరులకు సూచన: మీరు ఏదైనా సైబర్ నేరానికి గురైతే, వెంటనే మీ దగ్గరలోని జోనల్ సైబర్ సెల్ లేదా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. లేదా 1930 నంబర్‌కు కాల్ చేయండి. మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, అంత త్వరగా చర్యలు తీసుకోవడానికి, మరింత నష్టం జరగకుండా ఆపడానికి, మరియు మోసపోయిన డబ్బును తిరిగి పొందడానికి అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు. 

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్