
మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. అండర్-ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ మరియు ఎబ్.బి.డబ్ల్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో వేగం పెంచాలని ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును చేయాలని అధికారులకు సూచనలు చేశారు. పోక్సో, అత్యాచార కేసులలో వీలైనంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని, అందుకు భరోసా సెంటర్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు ఏక కాలంలో వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా మండల కేంద్రాలలో పీస్ కమిటీ మరియు డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సబ్-డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన త్వరితగతిన స్పందించడానికి “క్యూ.ఆర్.టి” (క్విక్ రియాక్షన్ టీం) లను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు సూచించారు. గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని లౌడ్ స్పీకర్స్, మైక్స్ పరిమిత లిమిట్లో, నిర్దిష్ట సమయం వరకే వినియోగించేలా మండప యజమానులకు గైడ్ చేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. గంజాయి స్మగ్లర్లపై జిల్లా కేంద్రం నుంచి నిఘా ఉంటుందని, అదేవిధంగా తమ తమ ఏరియాలో గల డ్రగ్ సెల్లర్స్, డిమాండ్స్ దారులను గుర్తించి కేసులు నమోదు చేయాలని ఎస్. హెచ్. ఓ. లకు సూచించారు. ప్రజలు “హ్యాక్-ఐ” అప్లికేషన్ గురించి తెలుసుకొని అప్లికేషన్ ద్వారా మనకు అవసరమైన సేవలను పొందవచ్చు అని జిల్లా ప్రజలకు సూచించడం జరిగింది. ఆన్లైన్ మోసాలు, మల్టీలెవెల్ మార్కెటింగ్ పై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని మల్టీలెవెల్ మార్కెటింగ్ నిర్వాహకులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ, పోలీస్ అధికారులం అంటే నమ్మరాదని ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే మొదటి గంట (Golden Hour) లోపు 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. అనంతరం వివిధ కేసులలో నిందితులకు జీవిత ఖైదు పడేలా వాదనలు వినిపించిన, పి.పి శైలజ, విజయ్ శంకర్ రెడ్డి, సత్యనారాయణ, రాజేశ్వర్ మరియు సూర్ రెడ్డి లను ఎస్పీ అభినందించి, సత్కరించడం జరిగింది. అదే విధంగా వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించి, రివార్డ్ లు అందజేశారు. అనంతరం యస్.హెచ్.ఓ వాహనాలను తనిఖీ చేస్తూ. ప్రతి వెహికిల్ ను రెగ్యులర్ సర్వీస్ చేయించాలని, ఎలాంటి రిపేర్స్ ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ. వెహికిల్ పూర్తి స్థాయిలో కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవరులకు సూచించారు. ఈ వాహనాల తనిఖీలలో ఎఆర్ డియస్పీ నరేందర్, వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, అడ్మిన్ ఆర్.ఐ. రామారావ్ ఉన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి ప్రభాకర్, జహీరాబాద్ డియస్పి సైదా నాయక్, నారాయణ ఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి,సైబర్ క్రైమ్ డియస్పి వేణుగోపాల్ రెడ్డి, డీసీఆర్బీ డియస్పి సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, ఎస్.నాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

