బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుగచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు
Uncategorized

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి – జిల్లా ఎస్పీ.

ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ మాట్లాడుతూ.జిల్లాలో పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరును,కేసుల చెదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న కాలంలో దృఢ నిశ్చయతో పనిచేయాలని అధికారులకు సూచించారు.పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పి లు,సి.ఐ లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచు సందర్శిస్తూ నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిపై కఠినంగా వ్యవాహరించాలన్నారు. జిల్లాలో గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. అక్రమ కార్యకలాపాలు అయిన మట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, PDS రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 13 న జరిగే జాతీయ మెగా లోక్ ఆధాలత్ ని ప్రజలు సద్వినియోగం చేసుకునేల అవగాహన కల్పించాలని,గుర్తించిన పెండింగ్ కేసులల్లో అన్ని పరిష్కరం అయ్యే విధంగా ప్రతి అధికారి కృషి చేయలని సూచించారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్.ఐ లు,ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని,ఈవిషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. విగ్రహాల ప్రతిష్టపన నుండి నిమార్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలాల వారిగా నిమార్జనం జరిగే ప్రదేశాలను గుర్తించి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ మండపాల వద్ద,శోభాయాత్రలో నిబంధనలు విరుద్ధంగా డి.జే లు,అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంల పై పూర్తి స్థాయిలో నిషేధం ఉందని,నిబంధనలు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డి.జే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు చిన్న స్పీకర్లు పోలీస్ వారి అనుమతితో ఏర్పాటు చేసుకోహలన్నారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐలు,ఎస్.ఐ కు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్