బ్రేకింగ్ న్యూస్
పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం
Uncategorized

పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశం – జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS.

జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వారి మళ్ళీ రిపిటెడ్ గా దొంగతనాలకు పాల్పడితే గ్యాంగ్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయిని ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా క్రయ విక్రయాల పైన,జూదం,పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినాయక ప్రతిమను ప్రతిష్టించదలచినవారు ముందస్తుగా జిల్లా పోలీసుల ఆన్లైన్https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినా జిల్లా పోలీసు అధికారులు ఆడిషనల్ ఎస్పీ జి. రమేష్ ఉత్తమ సేవ,RSI అశోక్ మహోన్నత సేవా పథకం,యస్.ఐ ఖాలీలుల్ల ఖాన్, ఏ.ఎస్.ఐలు వెంకట్ రెడ్డి, రవి ప్రసాద్, ఏ.ఆర్.యస్.ఐలు యాదగిరి రెడ్డి,రవి కుమార్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు,గోవర్ధన్ రెడ్డిలకు సేవా పతకాలు అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్,అడిషనల్ ఎస్పీ రమేష్,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, డి.సి.ఆర్.బి డీఎస్పీ రవి కుమార్,సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, ఏ. ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్