బ్రేకింగ్ న్యూస్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టినేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Uncategorized

స్వాతంత్ర దినోత్సవ మరియు వినాయక చవితి సందర్భంగా ముందస్తు బద్రత తనిఖీలు.

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్, ఆదేశాల మేరకు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం మరియు వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. క్లాక్ టవర్, పుట్నాల బట్టి, రామ్ మందిర్, పాన్ చౌరస్తా, తూర్పు కమాన్ మరియు ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో గల హోటళ్లు, టీ స్టాళ్లు, పాన్ షాపులలో స్పెషల్ పార్టీ బృందాలు మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, ప్రజలు భద్రతా నియమాలను పాటించి శాంతి భద్రతలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు బైకులపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ర్యాలీ చేసిన చట్టరీత్య చర్యలు తీసుబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్యతో పాటు ఎస్సైలు సీనయ్య, రషీద్, సిబ్బంది, స్పెషల్ పార్టీ సభ్యులు మరియు రుద్ర డాగ్ హాజరయ్యారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్