
అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు,ఇదే స్ఫూర్తిని జీవితంలోను,విధి నిర్వహణలోను కొనసాగించాలి: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.
ఘనంగా ప్రారంభం అయినా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025
ఘనంగా ప్రారంభించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న క్రీడల్లో రాణిస్తున్న పోలీసులు ఇతర క్రీడాకారులకు పోలీస్ క్రీడాకారులు క్రీడా ప్రదర్శన స్పూర్తిగా నిలవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS తెలిపారు. నేటి నుండి మూడు రోజుల పాటు మహబూబాబాద్ నూతన పోలీస్ మైదానం లో జరుగుతున్న ఈ పోలీస్ క్రీడల్లో తోలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హజరయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ క్రీడాకారులు కంటిజెంట్స్ నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌ను నిర్వహించగా, క్రీడలు నిర్వహిస్తున్న మైదానంలో ఎస్పీ యూనిట్ జెండాను ఎగురవేయడంతో పాటు, అకాశంలోకి పావురాలను, బెలూల్లను ఎగురవేయగా పోలీస్ క్రీడాకారులు తీసుకవచ్చిన క్రీడా జ్యోతిని ఎస్పీ కి అందజేసారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్బంగా పురుషుల, మహిళలకు ఎర్పాటు చేసిన 100 మీటర్ల పరుగు పోటీలతో పాటు, కబ్బాడి, లాంగ్ జంప్, టెన్నికైట్, క్రికెట్ క్యారెమ్స్ , చెస్, బ్యాట్మింటన్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ముందుగా ఈ క్రీడల్లో ఉత్సహంగా పాల్గోన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వహణాధికారులను ఎస్పీ అభినందనలు తెలుపుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడల్లో సంబంధించిన .ఈ మూడు రోజులు నిర్వహించు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గోనాల్సి వుంటుందని. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, మీరు క్రీడల్లో ప్రతిభ కనబరిచారో ముఖ్యమని. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దారుధ్యం పెరగడంతో పాటు, పనిఒత్తిళ్ళను అధిగమించి ఆరోగ్యంగా వుంటారని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమములో డీఎస్పీలు తిరుపతి రావు,కృష్ణ కిషోర్, శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, మోహన్, శ్రీనివాస్,ఇన్స్‌స్పెక్టర్లు,ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఎస్.ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది ఈ క్రీడల్లో ఉత్సహంగా పాల్గోన్నారు.
