
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మొత్తం 13 నేరాలు చేసిన ముఠా, వారి నుండి 12 లక్షల విలువ గల (115.50 గ్రాములు) బంగారు ఆభరణాలు మరియు (300 గ్రాముల) వెండి ఆభరణాలు, 25,000/- రూపాయల నగదు మరియు మొబైల్ ఫోన్, ఒక బైక్ స్వాదీనం. వీరు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 28 కేసులలో పాత నేరస్తులు. 1.బీసపోగు శాంసన్ తండ్రి: మరియదాసు, 2.కండర కొండ కృష్ణ కిశోర్ తండ్రి: ప్రసాద్, 3.దర్మడి దుర్గా ప్రసాద్ తండ్రి: ధర్మ రావు.
గత కొంత కాలంగా నల్లగొండ జిల్లాలో తాళం వేసిన ఇళ్లల్లో పగలు, రాత్రి సమయాల్లో దొంగతనాలు మరియు బైక్ డీక్కి ల నుండి దొంగతనాలు జరుగుతున్న నేపథ్యం లో నల్గొండ జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిసిఎస్, నల్లగొండ I టౌన్ పోలీసులు, చందంపేట్ మరియు పెద్దవూర పోలీసులు వివిధ ప్రాంతాలలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఉదయం 10:30 నిమిషాలకు చందంపేట మండలం పోలేపల్లి x రోడ్ వద్ద అనుమానాస్పదంగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఆపి “పాప్లాన్ డివైస్” (వేలిముద్రాల తనిఖి పరికరం) తో చెక్ చేయగా వీరు పాత నేరస్తులు అయిన బీసపోగు శాంసన్ మరియు కండర కొండ కృష్ణ కిశోర్ గా గుర్తించడం జరిగింది. తదుపరి వారిని విచారించగా బీసపోగు శాంసన్ జైల్ నుండి విడుదలైన తరువాత ఇంటి తాళాలను పగులకొట్టి, చందంపేట, వాడపల్లి, చింతపల్లి, ఇబ్రహీంపేట, నేరేడుచర్ల, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని బెల్లంకొండ, బండ్లమోటు పోలీసు స్టేషన్ పరిధులలో మొత్తం (09) దొంగతనాలకు పాల్పడినట్లు మరియు ఈ (09) దొంగతనాలలో (02) డీక్కి దొంగతనాలను, కండర కొండ కృష్ణ కిశోర్ తో కలిసి చేసినట్లు తెలిపాడు. తదుపరి కండర కొండ కృష్ణ కిశోర్ ను విచారించగా పెద్దవూర, పెబ్బేరు, తో పాటూ మోత్కూర్ పిఎస్ పరిధిలో కూడా (03) డీక్కి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపాడు. బీసపోగు శాంసన్ కు కండర కొండ కృష్ణ కిశోర్ కు చెర్లపల్లి జైల్ లో పరిచయం ఏర్పడినది అని జైల్ నుండి విడుదలైన తరువాత వీరు ఇరువురు కలిసి బైక్ డీక్కి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపాడు. తదుపరి విచారణలో వీరిపై గతంలో తమిళనాడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. నల్గొండ I టౌన్ పరిధిలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఒక అనుమానాస్పద వ్యక్తి బంగారం అమ్ముటకు బంగారు షాప్ కి వచ్చినట్లు సమాచారం రాగా, పోలీసులు అక్కడికి చేరుకొని అట్టి వ్యక్తిని అమ్ముటకు తెచ్చిన బంగారు ఆభరణాలు ఎక్కడివి అని విచారించగా తన పేరు దర్మడి దుర్గా ప్రసాద్ అని, తను కాకినాడ కు చెందిన వాడని, తాను జల్సాలకు అలవాటు పడి పగలు, రాత్రి సమయాల్లో ఇంటి తాళాలను పగులగొట్టి నల్గొండ జిల్లాలో దొంగతనాలకు పాల్పడినట్లు, నల్గొండ I టౌన్ పిఎస్ మరియు నల్గొండ II టౌన్ పిఎస్ పరిధిలో (03) దొంగతనాలకు పాల్పడినట్లు, ఈ బంగారు ఆభరణాలు నల్గొండ I టౌన్ పరిధిలోని ఇంటిలో రాత్రి పుట చేసిన దొంగతనం కు సంబంధించి ఉన్నట్లు తెలిపాడు. తదుపరి విచారణ జరుపగ ఇతనిపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇట్టి ముఠా సభ్యులను పట్టుకోవడంలో నల్గొండ డి.ఎస్.పి. కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ ఎమ్. జితేందర్ రెడ్డి, నల్గొండ I టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిండి సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న ఆద్వర్యంలో సిసిఎస్, ఎస్‌ఐ శివకుమార్, విజయ్ కుమార్, వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, సిసిఎస్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, నాగరాజూ, వహీద్ పాషా, సిసిఎస్, కానిస్టేబుల్స్ గులాం దస్తాగిరి, గణేశ్ లను జిల్లా SP ప్రత్యేకంగా అభినందించి రివార్డ్ లను ప్రకటించారు.

