Breaking News

ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

ఫిర్యాది సమస్యలను ఓపిగ్గా విని వారి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయవలసిందిగా యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపిగకగా విని, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత యస్.హెచ్.ఓ. లకు ఫోన్ ద్వారా మాట్లాడి, వారి సమస్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడం ఎలాంటి అలసత్వం చూపరాదని, చట్టప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ. లకు సూచనలు చేయడం జరిగింది. జిల్లా ప్రజలు తమ సమస్యకు పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకే పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా ఎస్పీ  సూచించారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *