బ్రేకింగ్ న్యూస్
ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు
Uncategorized

కొనరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ – జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.

ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని,నేరాల నియాత్రణయే లక్ష్యంగా గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారిస్తు గ్రామాలను తరచు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు,కోర్టు కేసులు,పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు,శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకొని పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేసి పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించిన జిల్లా ఎస్పీ. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 5s అమలు చేసిన తీరు,విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క డ్యూటీలు వారికి ఉన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకుని,రికార్డ్ రూమ్,రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు క్షుణ్నంగా పరిశీలించారు. బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది,అధికారులు పెట్రోలింగ్ సమయంలో స్టేషన్ పరిధిలోని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని,రౌడి షీటర్స్,హిస్టరీ షీటర్స్,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కఠినతరం చేస్తూ తరచు తనిఖీ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తునే వాటి వలన కలుగు అనర్ధాలపై, సైబర్ నెరల నియంత్రణ పై చైతన్య పరచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. మల్కపేట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలసి మొక్కలు నాటిన అనంతరం పోలీస్ అధికారులు,సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు ప్రారంభించి వారితో కలసి వాలీబాల్ ఆడిన ఎస్పీ. ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్