Breaking News

వివిధ కుల సంఘాల నాయకులతో పీస్ మీటింగ్- జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

•కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
•శాంతి భద్రతల పరిరక్షణలో 247 అందుబాటులో ఉంటా. ఏ సమయంలోనైనా ఈ నెంబర్ 8712656777 కు కాల్/మెసేజ్ ద్వారా సమాచారం అందించవచ్చు. •వివిధ కుల సంఘాల నాయకులతో పీస్ మీటింగ్ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లాలోని వివిధ కుల సంఘాలకు చెందిన నాయకులతో పీస్ మీటింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. డా. బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యంగ నిర్మాత, ఆయన ఏ ఒక్క కులానికి, మతానికి, ప్రాంతానికి పరిమితమైన వారు కాదని, ఆయన భారత దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం మార్గదర్శకంగా నిలిచారని ఎస్పీ గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. ఎవరైన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటామని ఎస్పీ హెచ్చరించారు. వివిధ సంఘాలకు చెందిన పెద్దలు గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి, కమ్మునిటీ ప్రశాంతత గురించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసు శాఖ తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అంధించడం జరుగుతుందని అన్నారు. AI (కృత్రిమ మేధస్సు) అందుబాటులో ఉన్న ప్రస్తుత రోజుల్లో AI ని ఉపయోగించి మనం చేసే పనిని సులభతరం చేసుకుంటున్నాం, కానీ కొందరు యువత AI ని చెడు మార్గాలలో వినియోగిస్తూ లేనిది ఉన్నట్టుగా వికృత ఫోటోలు తయారు చేసి, సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించేది లేదని, జిల్లా ఐటి సెల్ నుండి సోషల్ మీడియా పై నిరంతరం మానీటరింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. పై చర్యలకు పాల్పడిన అల్లరిమూకలపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే హిస్టరీ షీట్లను ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. అదే విధంగా నేరస్తులను శిక్షించేందుకు ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ప్రతి ఒక్కరు చట్టంలో పొందుపరిచిన, నిబంధనలు పాటిస్తూ నడుచుకోవాలని అన్నారు. అట్టి వ్యక్తులను శిక్షించడానికి చట్టం ఉందని, పై వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించవలసిందిగా సూచించారు. సమాజం శాంతి కోసం కృషి చేసే వారికి సహయం చేయడానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళల ముందుంటుందని, ఆదేవిధంగా చట్టానికి వ్యతిరేకంగా నడుస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారితో కటువుగా ఉంటామని ఎస్పీ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో 247 అందుబాటులో ఉంటామని ఏ సమయంలోనైనా ఈ నెంబర్ 8712656777 కు కాల్/మెసేజ్ చేసి సమాచారం అందించాలని సూచించారు. జిల్లా పోలీసు శాఖ తరపున వివిధ గ్రామాలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగహాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, సోషల్ మీడియాలో వచ్చేవన్ని నిజాలు కావని గుర్తించాలని, ఫార్వర్డ్ మెసేజ్ ల పట్ల జాత్రగా ఉండాలని, ఆ మెసేజ్ లో నిజం ఎంత? అని గుర్తించిన తరువాతనే ఫార్వర్డ్ చేయాలని అన్నారు. వాట్స్ ఆప్ గ్రూప్ లలో ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్ట్ లు చేసిన సంబంధిత గ్రూప్ అడ్మిన్ ల పై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. ఈ పీస్ మీటింగ్ నందు అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, ఎస్బీ, డీసీఆర్బీ ఇన్స్పెక్టవర్స్ విజయ్ కృష్ణ, రమేష్, వివిధ సంఘాల నాయకులు అతిమెల మాణిక్యం, కూన వేణు, కొండాపురం జగన్, పి. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గత కొద్ది రోజుల నల్లగొండ పట్టణము నంధు గంజాయి అమ్ముచున్న వ్యక్తి అరెస్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *