Breaking News

నల్గొండలో రద్దీ ప్రాంతాల్లో పోలీసులు-డాగ్ స్వాడ్ తో తనిఖీలు.

శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. టూ టౌన్ ఎస్సై సైదులు నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో నిషేధిత మత్తుపదార్ధాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండు తో పాటు లాడ్జి, దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఎస్సై సైదులు మాట్లాడుతూ.ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కల్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మరియు అదే విధంగా లాడ్జీల్లో బస చేసే వారి సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని, వారి యొక్క వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వవద్దన్నారు. అనుమానితుల వివరాలను వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి నిర్మూలనకు ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఎవరైన నిషేధిత మత్తు పదార్థలు వాడితే చర్యలు తప్పవన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిర్మూలించడంలో ప్రజలు, యువత కీలక పాత్ర పోషించాలని చెప్పారు. పట్టణంలో గంజాయి మూలాలను తొలగించడం కోసం పట్టణ పోలీసులు పటిష్ఠంగా పనిచేస్తున్నామన్నారు. సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై అన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గత కొద్ది రోజుల నల్లగొండ పట్టణము నంధు గంజాయి అమ్ముచున్న వ్యక్తి అరెస్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *